కుప్పం నియోజకవర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం కుప్పం టీడీపీ పార్టీ కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్, జనసేన ముఖ్య నాయకుడు పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు నియోజకవర్గం లోని టీడీపీ జనసేన ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం ని జగన్ సర్వనాశం చేసాడని, అక్రమాలకు రాష్ట్రాన్ని అడ్డాగా చెసారని రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా జగన్ ని గద్దె దించెందుకు పనిచేయాలని అన్నారు. జగన్ మూడు అంశాలను తన ఆయుధంగా పెట్టుకొన్నాడని దౌర్జన్యం, డబ్బు, దొంగ ఓట్లు లనే ఆయుదాలుగా మలుచుకున్నాడని రాబోయే ఎన్నికల్లో అన్నిటిని తిప్పికొట్టెందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడిగా పిలుపు నిచ్చారు. టీడీపీ mlc కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబు దురదృష్టి ప్రతి ఒక్కరికి తెలుసనీ ముక్కుసూటిగా ఉన్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ చంద్రబాబు తో కలిసి నడవడానికి ముందుకు రావడం రాష్ట్రానికి శుభసుచకమని అన్నారు. రాష్ట్రాన్ని రావణకష్టంగా మార్చిన జగన్ కి రాబోయే ఎన్నికల్లో టీడీపీ ,జనసేన కచ్చితంగా కోలుకోలేని దెబ్బకొట్టి తమ సత్తా చాటుతాం అని అన్నారు. ఇక మీదట ప్రతి సమావేశంలో కూడా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అని అన్నాను
జగన్ ను గద్దె దించడమే మా ఎజెండా – టీడీపీ, జనసేన
82
previous post