ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆర్టీసి చైర్మన్ మల్లికార్జున రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో బస్టాండ్ లో సుమారు 2.5 కోట్లతో నూతనంగా నిర్మించిన బస్టాండ్ విస్తరణ నిర్మాణాలను ఆర్టీసి అధికారులు, వైకాపా నేతలతో కలిసి వారు ప్రారంభించారు. వీరికి ఆర్టీసి అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్ ప్రాంగణం బస్సుల రవాణాకు, ప్రయాణీకుల సౌకర్యాలకు ఇబ్బందిగా ఉందని గుర్తించి.. అదనపు బస్ స్టాండ్ నిర్మాణానికి రూ 2.50 కోట్లు నిధులును మంజూరు చేయించామన్నారు. బస్ స్టాండ్ ప్రాంతాన్ని విస్తరించడంతో పాటు ఆధునిక వసతులతో భవనం, ఫ్లాట్ ఫార్మ్స్ విస్తరణ, లైటింగ్ లతో కూడిన సూచిక బోర్డులు, వర్టీకల్ టైల్స్, టాయిలెట్స్, ప్రహరీ గోడ ప్రయాణీకులకు సౌకర్యాల సుందరీకరణ తదితర అభివృద్ధి పనులు తీర్చి దిద్దడం జరిగిందన్నారు. దీంతో ప్రయాణీకుల ప్రాంగణం నగరాలలోని బస్ స్టాండ్ లకు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అదే విధంగా కడప- రాయచోటి, రాయచోటి- తిరుపతి కి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు వారు తెలియజేశారు.
ఆధునిక హంగులతో ఆర్టిసి బస్ స్టాండ్…
67
previous post