పాలకొల్లు: ఉపాధ్యాయుడిపై మాజీ విద్యార్థి ఘాతుకం…

Advertisements

<p>గురువుపై కక్షగట్టిన ఓ విద్యార్థి కిరాతకానికి ఒడిగట్టాడు&period; మంచి మార్గంలో నడవాలని చెప్పినందుకు రెండేళ్లపాటు మనసులో పగ పెంచుకుని&comma; అదను చూసి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు&period; పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో జరిగిన ఈ ఘటన విద్యాశాఖలో కలకలం రేపుతోంది&period;పాలకొల్లు మండలం లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుక్కల రాజా వెంకట సురేష్‌పై సోడదాసి ఆర్యదీప్ అనే యువకుడు దారుణంగా దాడి చేశాడు&period; రెండేళ్ల క్రితం ఆర్యదీప్ అదే స్కూల్లో చదువుతున్నప్పుడు&period;&period; తోటి విద్యార్థుల ప్లేట్లలో భోజనం లాక్కుని తినడంపై సురేష్ మాస్టర్ మందలించి&comma; ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు&period; అప్పటి నుండి మాస్టర్‌పై కక్ష పెంచుకున్న ఆర్యదీప్&period;&period; నేడు సమయం చూసి ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు&period; ఈ దాడిలో సురేష్ మాస్టర్ తల&comma; చేయి&comma; మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి&period; సహచర ఉపాధ్యాయులు వెంటనే ఆయనను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; ఈ ఘోరం గురించి తెలుసుకున్న డీఈఓ నారాయణ ఆసుపత్రికి చేరుకుని బాధిత ఉపాధ్యాయుడిని పరామర్శించారు&period; పాఠశాల పరిసరాల్లో ఇలాంటి ఘటనలు జరగడంపై ఉపాధ్యాయ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది&period; పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..

మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.