ఉండి మండలంలో పంట కాలువలు కాలుష్య మయం …

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండల పరిధిలోని ప్రధాన పంట కాలువలు ఇప్పుడు ప్రజలకు వరంగా కాకుండా భారంగా మారుతున్నాయి&period; చిలకుపాడు లాకులు నుంచి చెరుకువాడ బైల్ డ్యామ్ వరకూ విస్తరించిన ఈ కాలువలు ఎన్నో గ్రామాల జీవనాధారంగా ఉన్నాయి&period; అయితే&comma; కాలక్రమేణా ఇవి కాలుష్యపు కేంద్రమాలుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది&period; ఇళ్లలోని మరుగు దొడ్ల వ్యర్థాలను పైపుల ద్వారా నేరుగా కాలువల్లోకి వదలడం&comma; ప్లాస్టిక్&comma; ధర్మాకోల్ వంటి చెత్తను పారవేయడం వల్ల నీటి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది&period; గతంలో స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుని కొంతవరకు శుభ్రపరిచినా&comma; మళ్లీ అదే పరిస్థితి నెలకొనడం బాధాకరం&period; ముఖ్యంగా ఈ నీటినే చెరువుల్లో నింపుకుని తాగునీటిగా&comma; సాగునీటిగా వినియోగించడం వల్ల గ్రామాల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>డెల్టా ప్రాంతాలకు కీలకమైన ఉండి సబ్‌డివిజన్ పరిధిలో కాలువలు కలుషిత కాసారాలుగా మారిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది&period; కాలువల వెంబడి ఉన్న ఇళ్ల నుంచి వస్తున్న చెత్త&comma; పశువుల కళేబరాలు కూడా నీటిలో పడేయడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చుతోంది&period; ఇదే కాలుష్య నీటిని చెరువుల్లోకి నింపడం వల్ల ప్రజలు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; చర్మవ్యాధులు&comma; జీర్ణ సంబంధ సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు&period; ఈ నేపథ్యంలో కాలువలను శుభ్రపరచి&comma; చెత్తను పూర్తిగా తొలగించిన తర్వాతే చెరువుల్లోకి నీటిని నింపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period; కాలుష్యాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని&comma; బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు&period; ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంతరిక్ష రంగంలో తెలంగాణ గర్జన..

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నిర్మిస్తున్న ‘మండాడి’ షూటింగ్ పూర్తి.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు..

కోత సీజన్‌లో డీజిల్ కొరత.. రైతుల ఆందోళన..