నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…

Advertisements

<p>మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది&period; మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు&period; కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది&period; గత రెండేళ్లలో ఐదుగురు కమిషనర్లు మారడం పరిపాలనలో స్థిరత్వం లేకపోవడానికి ప్రధాన కారణంగా మారింది&period; ఒక అధికారి వ్యవస్థను అర్థం చేసుకునేలోపే మార్పు జరగడంతో ప్రణాళికలు అమలు దశకు చేరక ముందే ఆగిపోతున్నాయి&period; ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ అభివృద్ధి పూర్తిగా స్థంభించిపోయింది&period; పాలనలో నిర్లక్ష్యం పెరగడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period; నగర పంచాయితీగా మారినా&comma; గ్రామ స్థాయి సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి&period; ఈ పరిస్థితి పొదిలి పట్టణ అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారింది&period; స్థిరమైన పరిపాలన లేకుండా అభివృద్ధి సాధ్యం కాదనే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>పొదిలి నగర పంచాయితీలో ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది&period; పన్నుల రూపంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా&comma; అందులో సగం కూడా వసూలు కాలేకపోవడం అధికారుల వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది&period; ఆదాయం లేకపోవడంతో కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది&period; ఈ కారణంగా శానిటేషన్ సేవలు&comma; పట్టణ నిర్వహణ పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి&period; మరోవైపు ప్రజలు కూడా అభివృద్ధి లేకపోతే పన్నులు ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నిస్తున్నారు&period; ఈ వాదనతో పన్నుల వసూళ్లు మరింత తగ్గిపోతున్నాయి&period; ఒకవైపు ఆదాయం లేదు&comma; మరోవైపు అభివృద్ధి లేదు అన్న చందంగా నగర పంచాయితీ మారింది &period; ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పారదర్శక పాలన అవసరం&period; లేకపోతే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p>పొదిలి పట్టణంలో ప్రాథమిక సదుపాయాల కొరత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది&period; పాత డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది&period; దీంతో వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది&period; రహదారుల విస్తరణ&comma; వీధి దీపాలు&comma; తాగునీటి సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం పట్టణ అభివృద్ధి ఎంత వెనుకబడిందో తెలుపుతోంది &period;ఇక రాజకీయ జోక్యం అధికంగా ఉండటం కూడా అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారినిదని స్థానికులు అంటున్నారు &period; అధికారులు స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి&period; పైగా కార్మికుల వేతనాలు కూడా ఆలస్యంగా చెల్లిస్తునట్లు తెలుస్తోంది &period;<&sol;p>&NewLine;<p>ఈ పరిస్థితుల్లో సమర్థవంతమైన అధికారిని నియమించి&comma; రాజకీయ జోక్యాన్ని తగ్గించి&comma; ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది&period; ప్రజలకు అభివృద్ధి ఫలాలు చూపగలిగితేనే పొదిలి నిజమైన నగర పంచాయితీగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.