పవన్ కల్యాణ్ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం…

Pawan Kalyan released a statement

Advertisements

&NewLine;<p>జనసేన పార్టీ అధినేత <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">పవన్ కల్యాణ్<&sol;a> రాజకీయ పొత్తులపై జనసైనికులకు హితోపదేశం చేశారు&period; రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు అని పేర్కొన్నారు&period; పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానాలు వద్దు అని స్పష్టం చేశారు&period; ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు&period; జన హితానికి&comma; రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది&period; విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సమగ్రాభివృద్ధి&comma; ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామన్నారు&period; ప్రస్తుతం పొత్తులకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్న దశలో జనసేన పార్టీ నేతలు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయొద్దు&period; పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయవద్దు&period; ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినవారవుతారని పవన్ హెచ్చరించారు&period; పొత్తుకు విఘాతం కలిగించాలని ఎవరు ప్రయత్నించినా వారిని ప్రజలు గమనించకమానరు&period; ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు&period; ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండడం అవసరమని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.