జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెనాలి పర్యటన రద్దయింది. తెనాలి(Tenali)లో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను జనసేన రద్దు చేసింది. పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురికావడంతో పర్యటన రద్దయింది. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పిఠాపురంలో మండుటెండలో ప్రచారాన్ని నిర్వహించిన పవన్ అస్వస్థతకు గురయ్యారు.
ఇది చదవండి: ఏపీలో మండిపోతున్న ఎండలు..!
జ్వరంతో బాధపడుతున్న ఆయన… చికిత్స కోసం హైదరాబాద్ కు పయనమయ్యారు. దీంతో, ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు తెనాలితో పాటు, రేపు నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి