పెద్దాపురం టీడీపీ అభ్యర్థి చినరాజప్ప…

The car went over the divider

Advertisements

&NewLine;<p>ఐదేళ్ల కాలంలో టిడిపి నేతలు చేసిన పని తీరును బట్టి చంద్రబాబు టికెట్లు కేటాయించారని పెద్దాపురం టిడిపి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు&period; మొదటి విడతలో చినరాజప్పను పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించిన తర్వాత నియోజకవర్గం వచ్చిన రాజప్పకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి… గజమాలలు వేసి… భారీ ర్యాలీ నిర్వహించారు&period; జె తిమ్మాపురంలో టీడీపీ కార్యాలయాన్ని రాజప్ప ప్రారంభించారు&period; ఈ సందర్భంగా రాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లుగా పార్టీకి పనిచేసిన వారికి చంద్రబాబు తగిన గుర్తింపు ఇచ్చారని… వైసీపీలో ఆ పరిస్థితి లేదని సీఎం జగన్ వల్లే 175 స్థానాల్లో వైసిపి ఎమ్మెల్యేలు&comma; ఇన్చార్జులు వెనుకబడి ఉన్నారని ఆరోపించారు&period; ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వరాశనం చేశారని రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు&period; పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కు ప్రమాదం తప్పింది… టికెట్టు ప్రకటించిన సందర్భంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు&period; ర్యాలీ గా వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్ళింది&period; ప్రమాద సమయంలో రాజప్ప కారులోనే ఉన్నారు&period; ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు&period; టీడీపీ కార్యకర్తలు వాహనాన్ని కిందకి దించి పంపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.