69
రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరులో ఎంపి అయోధ్య రామిరెడ్డి, ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, తదితర ముఖ్య నేతలతో కలిసి రూ.6.25 కోట్లతో అభివృద్ధి చేసిన నగరపాలక సంస్థ గాంధీ పార్క్ ను పునః ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం నుండి పచ్చదనం ప్రశాంతతని అందించడంలో పార్క్ లు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గాంధీ పార్క్ అభివృద్ధి ద్వారా గుంటూరు నగర ప్రజలకు ఆహ్లాదం అందేలా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుందన్నారు. మారుతున్న ప్రస్తుత కాలానికి తగిన విధంగా పిల్లలకు ఎడ్యుకేటివ్ గా పార్క్ ని తీర్చిదిద్దారన్నారు.