దేశ వ్యాప్తంగా ఆరవ దశ పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, జమ్మూ కశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 11 కోట్ల 13 లక్షల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5 కోట్ల 84 లక్షల మంది పురుషులు, 5కోట్ల 29లక్షల మంది మహిళలు, 5 వేల 120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 11 లక్షల 4 వేల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకులలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కర్నాల్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ మనోహర్ లాల్ ఖట్టర్, అనంతనాగ్-రాజౌరి నుంచి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆరో దశ పోలింగ్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని అధికార బీజేపీ సహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని 7 స్థానాలపై పార్టీలు దృష్టిపెట్టాయి. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాలు, ఆప్ 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి. హర్యానాలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జూన్ 1తో ఏడవ దశ పోలింగ్ కూడా ముగుస్తుంది. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.