దేశ వ్యాప్తంగా ఆరవ దశ పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్‌లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, జమ్మూ కశ్మీర్లో 1 సీటు, జార్ఖండ్‌లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 11 కోట్ల 13 లక్షల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5 కోట్ల 84 లక్షల మంది పురుషులు, 5కోట్ల 29లక్షల మంది మహిళలు, 5 వేల 120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 11 లక్షల 4 వేల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకులలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కర్నాల్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ మనోహర్ లాల్ ఖట్టర్, అనంతనాగ్-రాజౌరి నుంచి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆరో దశ పోలింగ్‌లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని అధికార బీజేపీ సహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని 7 స్థానాలపై పార్టీలు దృష్టిపెట్టాయి. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాలు, ఆప్ 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి. హర్యానాలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జూన్ 1తో ఏడవ దశ పోలింగ్ కూడా ముగుస్తుంది. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కేరళంలోని వయనాడ్‌లో పోస్టర్ల కలకలం.కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్‌లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
- దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది..సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్‌కు గాయాలయ్యాయి. రెడ్‌బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 74870