ఇద్దరు మహిళలతో పాటు గంజాయి ని స్వాధీనం చేసుకున్న SOT పోలీసులు. పరారీలో ప్రధాన నిందితుడు. మంగళవారం ఛత్రినాక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ భయ్యా లాల్ నగర్ లో నివసించే పద్మ కుమారుడు శ్రీనివాస్ చారి చెడు సవాసాలకు బానిస కావడంతో కొన్నాళ్ల క్రితం తలిదండ్రులు శ్రీనివాస్ చారి ని ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ చారి సంతోష్ నగర్లో ఓ అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నాడు. తరుచూ ఆంద్రప్రదేశ్ మచిలీపట్నం వెళ్లి వచ్చే వాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆశ తో గంజాయి దందాలో దిగాడు. ఇతర ప్రాంతాల నుంచి గంజాయి హైదరాబాద్ తీసుకువచ్చి యువతను టార్గెట్ చేసి విక్రయిస్తున్నాడు.
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం గంజాయి కావాలని శ్రీనివాస్ కు పరిచయం ఉన్న ఓ స్నేహితుడు కోరడంతో పాతబస్తీలో భయ్యా లాల్ నగర్ లో ఉండే తలిదండ్రుల ఇంటికి రావాల్సిందిగా స్నేహితుడికి శ్రీనివాస్ చారి సూచించాడు. అనంతరం 14 కేజీల గంజాయి తీసుకుని భయ్యా లాల్ నగర్ లో ఇంటికి శ్రీనివాస్ చారి చేరుకున్నాడు. ఇంట్లో గంజాయి పెట్టి మాట్లాడగా ఓ వ్యక్తి SOT పోలీసులకు విశ్వసనీ సమాచారం అందించాడు. వెంటనే శంషాబాద్ SOT పోలీసులు ఇంటిపై దాడి చేసి గంజాయి పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించిన శ్రీనివాస్ చారి ఇంటిపై నుంచి కిందకు దూకి పారిపోయాడు. శ్రీనివాస్ చారికి ఆశ్రయం ఇచ్చిన తల్లి తో పాటు మరో యువతిని అదుపులోకి తీసుకుకుని ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.
ఇది చదవండి: పింఛన్ల నిలిపివేతపై టీడీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి