తిరుపతి (Tirupathi).
టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు | MLA Bhumana Karunakar
నిన్న రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి(Attack on Jagan), చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన హత్యాయత్నమే…….టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ మధ్య వాళ్లిద్దరూ ఏ వేదిక మీదైనా మైకులెత్తుకుని మాట్లాడినా, జగన్ అంతుచూస్తాం, జగన్ పని ఇక అయిపోయింది అని అంటున్నారు. తమ కార్యకర్తలను, గూండాలను రెచ్చ గొట్టే మాటలే చెబుతూ వస్తున్నారు. ఆ క్రమంలోనే విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి మీద జరిగిన హత్యాయత్నమే | ఎమ్మెల్యే భూమన
దీనికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్లే. ఈ హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు గత చరిత్ర అంతా రక్తంతో తడిసిందే. ఈరోజు అందులో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ని కూడా చేర్చుకున్నాడు. జగన్ మోహన్ రెడ్డి ని నేరుగా రాజకీయల్లో ఎదుర్కొనే శక్తి లేక, భౌతికంగా అంతమొందించే కుట్ర చేశారు. ఈ కుట్రలో భాగంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన రెక్కీ మాత్రమే ఇది. నిన్న విజయవాడలో జరిగిన హత్య దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య రాజకీయాలను ఖండిస్తూ తిరుపతిలో రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేసిన వేలాది మంది ప్రజలు. పేద ప్రజల గుండెల్లో కొలువై ఉన్న మహా నాయకుడు వైఎస్ జగన్ కు ఏదైన ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర ప్రజలంతా భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాదిమంది ప్రజల గుండెలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ గాయపరిచారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: చంద్రబాబు, పవన్ లు కలిసి చేసిన దాడి ఇది- ఎమ్మెల్యే భూమన కరుణాకర్