తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో గంట ముందే పోలింగ్ ముగించారు సిబ్బంది. క్యూ లైన్లలో ఉన్న వారిని మాత్రమే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. పోలింగ్ ముగిసిన నియోజకవర్గాల జాబితాలో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. ఇక మిగతా నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.మధ్యాహ్నం 3 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో అత్యధికంగా 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also..
Read Also..