67
తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక, పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే బూత్‌ల వద్దకు ఓటర్లు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక, సినీ ప్రముఖులు మాత్రం ఉదయమే ఓటు వేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా ఓటు వేశారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ బూత్‌లో కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పట్టణాల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశ ప్రగతి కోసం ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ముఖ్యంగా యూత్ తప్పకుండా ఓటు వేయాలన్నారు.