రామగిరి మండలం లంకకేసరం గ్రామం లోని కేసరం చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసిన అధికార BRS పార్టీ గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. శుక్రవారం మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో AO తూము రవీందర్ కు CPM పార్టీ అధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా CPM పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ గత 30సంవస్ట్రాల క్రితం అప్పటి ప్రభుత్వం లంకకేసారం గ్రామ దళితులకు కేసారం చెరువు శిఖం భూములు సర్వే నంబర్ 75 లో గల భూములను దళితులకు ఇచ్చి ప్రొసీడింగ్స్ కాపీలు ఇచ్చారని అప్పటి నుండి అట్టి భూమిలో దళితులు సాగు చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు అని అన్నారు. ఈ మధ్య కాలంలో అధికార BRS పార్టీ గ్రామ సర్పంచ్ దళితుల భూముల పై కన్నేసి అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా ఆక్రమించి చెరువు శిఖం భూమిలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నరు అని అన్నారు గత వారం రోజుల క్రితం రామగిరి తహశీల్దార్ గారికి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి చెరువు శిఖం భూమి కబ్జా పై విచారణ చేపట్టి గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని ఓట్ల కోసం గ్రామానికి వచ్చే BRS న్యాయకులను నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమం లో CPM నాయకులు ఆర్ల సందీప్, గ్రామస్థులు ఇరుగురాల సతీష్, ఇరుగురల రమేష్, ఇరుగురాల పవన్, తదితరులు పాల్గొన్నారు.
చెరువు శిఖం భూములు కబ్జా..
246