వాయిదా పడ్డ సింగరేణి ఎన్నికల విచారణ…

singareni election hearing postponed

Advertisements

&NewLine;<p>సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది సింగరేణి ఎన్నికలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది&period; ఎన్నికలను డిసెంబర్ 27 కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది&period; ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిక నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు&period; అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలను నిర్వహిస్తామని గతంలో చెప్పారని కోర్టు గుర్తుచేసింది&period; అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి సమయం కావాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ ఈనెల 21కి వాయిదా వేసింది&period; సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొదటి నుంచి అవాంతరాలు&comma; ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చేముందు ఒకసారి గుర్తింపు కార్మిక సంఘం&comma;ఆతర్వాత యాజమాన్యం&comma; మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వేరు వేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి&period; చివరికి అక్టోబర్ లో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి&period; ఈ నెల 21 న కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయం సందిగ్ధత నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..