72
నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో నిన్న మధ్యాహ్నం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హాస్టల్ విద్యార్థులు రాత్రంతా స్నానాలు, నిద్ర లేక అంధకారంలో గడిపారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎదురైన పవర్ కట్ తో తీవ్ర అవస్థలకు గురౌతున్నారు. ఇప్పటి వరకు విద్యుత్ సమస్య పరిష్కారం కాకపోవడంతో స్టూడెంట్స్ ఉదయం నుండి హాస్టల్ గదులకు పరిమితమైనారు. మెస్ నిర్వాహాకులు బయట నుండి జనరేటర్లు తెప్పించి విద్యార్థులకు అల్పాహారంను సిద్ధం చేస్తున్నారు.
Read Also..