హైదరాబాద్ లో పవర్ కట్స్ ..!

Power cuts in Hyderabad

Advertisements

&NewLine;<p>హైదరాబాద్‌లో విద్యుత్ కోతలకు TSSPDCL సిద్ధమవుతోంది&period; సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు&period; వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే ఈ కోతలని ఆయన స్పష్టం చేశారు&period; ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని&comma; జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు&period; సమ్మర్ రబీ సీజన్‌లో ఉండే విద్యుత్ డిమాండ్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకు రెండు గంటల కోతలు అవసరం పడొచ్చని వివరించారు&period; సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు&period; అయితే&comma; నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు&period; మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం&comma; విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం&comma; అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని ముషారఫ్ తెలిపారు&period; పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని&comma; ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు&period; జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల ఫీడర్లు ఉన్నాయని&comma; ఆయా ఫీడర్ల పరిధిలో రెండు గంటల కోతలు ఉంటాయని తెలిపారు&period; సమ్మర్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని&comma; కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్టు ఫారూఖీ వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్