మండల స్థాయికి ప్రజావాణి విస్తరించాలి..

Advertisements

<p>రాష్ట్రంలో ప్రజల అర్జీలు&comma; ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయడంతో ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‍కు&comma; జిల్లా కేంద్రానికి వచ్చే బదులు &period;&period;ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేస్తే&period;&period;ఇబ్బందిలేకుండా ఉంటుందన్నారు&period; ఈ మేరకు ఎంసీహెచ్‍ఆర్‍డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు&comma; సీఎంవో అధికారులను ఆదేశించారు&period; వెంటనే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని&&num;8230&semi; తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు&period; ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని&comma; సంబంధిత విభాగాలకు పంపించాలన్నారు&period; పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు&period; ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని&comma; ఆలస్యం జరగకూడదని చెప్పారు&period; ఫిర్యాదుల నమోదు&comma; ట్రాకింగ్&comma; పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు&period; జిల్లా&comma; రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు&period; ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అన్నారు&period; ప్రతి జిల్లాలోనూ&comma; ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలని చెప్పారు&period; ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే&comma; పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు&period; అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period; జిల్లా&comma; రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ అన్నారు&period; పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు&period; డ్యాష్‌బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని&comma; ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు&period; ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి&comma; రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని&comma; కిందిస్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు&period; ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని సీఎం సూచించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజే 2023 డిసెంబర్ 8à°µ తేదీన ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు&period; అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం&comma; శుక్రవారం మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజా భవన్లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది&period; అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలు&comma; దరఖాస్తులను స్వీకరించి &&num;8230&semi;వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు&period; జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల అధ్వర్యంలో ప్రతి వారం ప్రజా‍వాణి నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..