పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామం లో స్థానికులు గత రెండు రోజుల నుండి రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. గ్రామం లో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడుతున్నారని తెలిసి కేసానుపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకి దిగారు. గత 50 సంవత్సరాల నుండి ఈ గ్రామంలోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే కొన్ని వందల కుటుంబాలు ఇల్లు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకులు మావి, మేము ఇల్లు, ఉపాధి కోల్పోతే ఎలా బ్రతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టకుండా, అండర్ బ్రిడ్జ్ వేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం లేదంటే ఆత్మహత్యలకు సిద్ధమంటున్న కేసానుపల్లి గ్రామస్తులు.
న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు సిద్ధం..
71
previous post