67
బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారత రత్న అవార్డు దక్కింది. 1990వ దశకం ప్రారంభంలో అయోధ్యలోని రామ మందిరం కోసం రథ యాత్రతో పార్టీని జాతీయ స్థాయికి చేర్చారు బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ. ఆయనకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రావడం పట్ల ప్రముఖ నాయకులంతా హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఆయన కృషి ఎనలేనిదన్నారు ప్రధానమంత్రి మోదీ. దేశ అభివృద్ధిలో అద్వానీది కీలక పాత్ర అని కొనియాడారు. ఆయనను కలిసి ప్రధాని మోదీ తన అభినందనలు తెలియజేశారు.