రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Advertisements

<p>పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రత&comma; నిత్యావసరాల సరఫరా&comma; రాష్ట్రాల సన్నద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు&period; రాష్ట్రాలు&comma; కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో&&num;8230&semi; చమురు&comma; గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు&period; కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు &&num;8216&semi;టీమ్ ఇండియా&&num;8217&semi; స్ఫూర్తితో సమన్వయంతో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;<p>అమెరికా&comma; ఇజ్రాయెల్ దళాలు ఫిబ్రవరి 28à°¨ ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే&period; ఈ సంఘర్షణ ప్రభావం భారత్ ఇంధన దిగుమతులు&comma; ఎరువుల సరఫరా&comma; ఇతర వాణిజ్య కార్యకలాపాలపై పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period; ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఈ సమీక్ష చేపట్టారు&period; పెట్రోల్&comma; డీజిల్&comma; వంటగ్యాస్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా చూడటం&comma; సరఫరా గొలుసును పటిష్ఠపరచడం&comma; నల్లబజారు&comma; కృత్రిమ కొరతను నివారించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు&comma; తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి&comma; ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్&comma; మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్&comma; గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు&period; అయితే&comma; ఎన్నికల ప్రవర్తనా నియమావళి &lpar;ఎంసీసీ&rpar; అమలులో ఉన్నందున తమిళనాడు&comma; పశ్చిమ బెంగాల్&comma; అసోం&comma; కేరళ&comma; పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ భేటీకి హాజరుకాలేదు&period; ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో క్యాబినెట్ సెక్రటేరియట్ విడిగా సమావేశమవుతుందని కేంద్రం తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.