ఈ గింజల్ని రోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ కంటి చూపును మెరుగుపరచడంతోపాటు బాడీ మెటపాలిజంని పెంచుతాయి. మొలకెత్తిన గింజల్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ తో పాటు రక్త సరఫరా సక్రమంగా జరిగేలాగా చూస్తుంటాయి. అంతేకాకుండా శరీరంలో అన్ని భాగాలకు మెదడుకు సైతం రక్తం సరఫరా సక్రమంగా జరగడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. బరువు తగ్గాలి అనుకున్నవారు ఉదయం అల్పాహారంలో వీటిని భాగం చేసుకోవడం ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనని కలిగిస్తుంది. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. కానీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు వీటితో అందుతాయి. మొలకల్ని తీసుకోవడం వల్ల ఇవి శరీరంలో క్యాన్సర్ కారకాలని పెరగనివ్వవు. అంతేకాకుండా క్యాన్సర్ కణాలని అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచడంలో ఇవి ముందుంటాయి. సాధారణంగా మొలకెత్తి గింజల్ని తీసుకోవడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా మారుతాయి. ఇవి చర్మాన్ని, గోళ్ళని ఆరోగ్యంగా మారుస్తాయి. అంతేకాకుండా చర్మం మెరిసేలా చేయడంతో పాటు అందాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకుంటే జుట్టు ఊడే సమస్య అదుపులో ఉంటుంది. ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్తవి వచ్చి సక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది.
మొలకెత్తిన గింజలతో లాభాలు..!
71
previous post