ఎన్నికల్లో తనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వక పోవడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghuramakrishna Raju) ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేస్తున్నది ఒంటరిపోరాటమని, న్యాయానికి ఎప్పుడూ బలం ఉంటుందని అన్నారు. నాకు ఏ పార్టీ మద్దతు లేదు మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎందుకంటే నేను ఏ పార్టీలో సభ్యుడ్ని కానని తెలిపారు. ఏ పార్టీలో సభ్యుడ్ని కాకపోవడం వల్లే మద్దతు ఇవ్వడంలేదని అంటున్నారని రఘురామ అన్నారు.
ఇది చదవండి: పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన జేడీ…
బీజేపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, టీడీపీ కావొచ్చు ఈ కూటమిలో ఎంతోమందికి సీట్లు ఇచ్చారు. నేను చేసిన పోరాటమే నాకు శాపంగా మారిందన్నారు. నేను రాజకీయ స్వార్థం లేని వాడినని, స్వార్థపరుడ్నే అయివుంటే నేను కూడా పార్టీ పెట్టేవాడ్నేమో అన్నారు. శ్రామికుడు అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాని రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి