దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు పెరుగుతోంది -రాంచందర్​రావు..

Advertisements

<p>దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు పెరుగుతుండటంతో దక్షిణాదిలో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పేర్కొన్నారు&period; రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని&comma; డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు&period; ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ జన ఆగ్రహ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు&period; అంతకు ముందు పార్టీ ఎంపీలు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలతో కలిసి ప్రధాని పర్యటన ఏర్పాట్లు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు&period; మే 10à°¨ హైదరాబాద్‌లో దాదాపు 8వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు&comma; ప్రారంభోత్సవాలు చేయనున్నారని రాంచందర్ రావు తెలిపారు&period; మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని తొలిసారిగా తెలంగాణకు వస్తున్నట్లు ఆయన తెలిపారు&period; రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు&comma; మహిళలు&comma; యువత&comma; జెన్-జడ్ సహా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>పశ్చిమ బెంగాల్&comma; తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ విజయాన్ని సాధిస్తుందని&comma; పుదుచ్చేరిలోనూ అధికారంలోకి వస్తుందన్నారు&period; అదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు&period; బీఆర్ఎస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని&&num;8230&semi;కేబినెట్‌లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని అన్నారు&period; పాలనలో కూడా తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు రామచందర్ రావు&period; ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళల పట్ల&comma; యువత పట్ల&comma; రాష్ట్ర ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు&period; ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాంచందర్ రావు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..