నర్సరీ రంగంలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో ఆధ్యాత్మికత ఉట్టి పడేలా.. హిందుత్వాన్ని చాటి చెప్పేలా సుమారు 50 వేల మొక్కలతో అయోధ్య రామమందిరాన్ని నూతన సంవత్సర సందర్భంగా తీర్చిదిద్దారు. 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కడియపులంక సత్యదేవా నర్సరీలో చైర్మన్ పుల్లా ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ అద్భుత కళాఖండం తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన వివరాలను ఆంజనేయులు మీడియాకు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ నెల 24న అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గత పది రోజులుగా నర్సరీ కార్మికులు ఎంతో శ్రమకు వచ్చి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళకు కట్టినట్టు తీర్చిదిద్దారన్నారు. భవిష్యత్తు కాలంలో శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో శ్రీరామరక్షగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అయోధ్య రామయ్య మందిర నమోనాను సిద్ధం చేసినట్టు తెలిపారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నమూనా అయోధ్య రామ మందిరాన్ని తిలకించాలని విజ్ఞప్తి చేశారు. తాళ్లూరు మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఈ నమూనాను సందర్శించి సత్యదేవ నర్సరీ చైర్మన్ పుల్లా ఆంజనేయుల్ని అభినందించారు. సత్య దేవా నర్సరీ నిర్వాహకులు పుల్లా వీరబాబు, పుల్లా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నర్సరీలో కొలువు తీరిన రామయ్య
135
previous post