నర్సరీలో కొలువు తీరిన రామయ్య

Satyadeva Nursery

Advertisements

&NewLine;<p>నర్సరీ రంగంలో ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో ఆధ్యాత్మికత ఉట్టి పడేలా&period;&period; హిందుత్వాన్ని చాటి చెప్పేలా సుమారు 50 వేల మొక్కలతో అయోధ్య రామమందిరాన్ని నూతన సంవత్సర సందర్భంగా తీర్చిదిద్దారు&period; 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కడియపులంక సత్యదేవా నర్సరీలో చైర్మన్ పుల్లా ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ అద్భుత కళాఖండం తీర్చిదిద్దారు&period; దీనికి సంబంధించిన వివరాలను ఆంజనేయులు మీడియాకు వివరించారు&period; ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ నెల 24న అయోధ్యలో రామ మందిరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గత పది రోజులుగా నర్సరీ కార్మికులు ఎంతో శ్రమకు వచ్చి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళకు కట్టినట్టు తీర్చిదిద్దారన్నారు&period; భవిష్యత్తు కాలంలో శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో శ్రీరామరక్షగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అయోధ్య రామయ్య మందిర నమోనాను సిద్ధం చేసినట్టు తెలిపారు&period; ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నమూనా అయోధ్య రామ మందిరాన్ని తిలకించాలని విజ్ఞప్తి చేశారు&period; తాళ్లూరు మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఈ నమూనాను సందర్శించి సత్యదేవ నర్సరీ చైర్మన్ పుల్లా ఆంజనేయుల్ని అభినందించారు&period; సత్య దేవా నర్సరీ నిర్వాహకులు పుల్లా వీరబాబు&comma; పుల్లా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్