ఆదిలాబాద్‌లో అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ..

Advertisements

<p>తెలంగాణలోని ఎయిర్ పోర్టులపై అన్ని డిమాండ్లు పరిశీలిస్తున్నామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు&period; ఫీజబులిటీ ఉన్న చోట ఎయిర్ పోర్టుల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు&period; వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్‍పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆదిలాబాద్&comma; కొత్తగూడెం ఎయిర్ పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నట్లు చెప్పారు&period; ఆదిలాబాద్ లో పెద్ద ఎయిర్ పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తోందని సైనిక&comma; పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మించబోతున్నట్లు చెప్పారు&period; ఇందుకోసం సివిల్ ఏవియేషన్‍తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణశాఖ సైతం చెప్పిందని వెల్లడించారు&period; ఈ నెల 17à°¨ ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని&comma; రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటారన్నారు&period; ఆదిలాబాద్ లో రక్షణ శాఖకు 360 ఎకరాలు ఉందని&comma; ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు&period; ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అనుకూలతలు ఆదిలాబాద్ లో ఉన్నాయని చెప్పారు&period; పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఎయిర్ పోర్టును రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది&period; ఇక్కడ ఎయిర్ పోర్టు ప్రతిపాదనపై ఫీజబులిటీ నివేదిక సానుకూలంగా ఉందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.