76
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరు లో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లని వారు తొలగించారు. స్టేడియం లో విద్యార్థుల కి మెరుగైన వసతులు ,సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితి ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.