రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో భాగంగా స్థానిక పద్మావతి నగర్ లో ఉన్న ఇండోర్ స్టేడియంలో తెలుగుపేట కొత్తపల్లికి చెందిన కబాడీ జట్ల ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఇరుజట్ల ఆటగాళ్లు మూకుమ్మడిగా పిడి గుద్దులు గుద్దుకున్నారు. ఈ ఘర్షణలో తెలుగుపేటకు చెందిన ఆటగాళ్లకు గాయాలుగా వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న రెఫరీలు, స్థానిక పోలీసులు కలుగజేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది.
Adudham andhra program
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం కాస్త కొట్టుకుందాం ఆంధ్ర గా తయారయ్యింది. కుప్పం ద్రావిడ వర్సిటీ లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు బహబహిగి దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు, కుర్చీలను విసిరేస్తూ నానా భీబస్తాం సృష్టించారు. విద్యార్థులు కర్రలు తో దాడిచేస్తూ వీరంగం సృష్టించారు. వందల మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆడుదాం ఆంధ్ర కాస్త కొట్టుకుందాం రా పోటీలుగా తయారయ్యాయి. కార్యక్రమంలో విద్యార్థుల నడుమ ఒక ఆటలో తలెత్తిన వివాదం కాస్త తరస్థాయికి చేరుకొని భయానక వాతావరణం తయారయ్యింది. ఇంత జరుగుతున్న వర్సిటీ అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు కనీసం వారిని అదుపుకూడా చేయకుండా ప్రేక్షక పాత్ర వహించడం విశేషం.
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లో ఆర్భాటంగా మంత్రి సురేష్ చేత ప్రారంభించిన “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమం గత నాలుగు రోజుల నుండి ఆటలు ఆడే క్రీడ కారులు లేక క్రీడ మైదానం విలవిలలాడిపోతుంది. క్రీడాకారుల కోసం రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎదురుచూసి వారి కళ్ళు కాయలు కాస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మార్కాపురంలో అట్టర్ ప్లాప్ అయింది. ఆటలు ఆడడానికి ఏ క్రీడాకారులు రాకపోవడంతో వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు సహనం కోల్పోయి అసహనంతో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి లో అస్తవ్యస్తంగా మారింది. ఏలూరు ఇండోర్ స్టేడియంలో గత మూడు రోజులుగా తూతూ మంత్రంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కనీసం క్రీడాకారులకు క్రికెట్ కి సంబంధించిన క్రీడ పరికరాలు అందజేయకుండా క్రీడలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రీడ పరికరాలు నాసిరకంగా ఉండటం వల్ల క్రీడాకారులే తమ క్రీడ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం తో పలు విమర్శలు కు తావిస్తున్నాయి. క్రీడలను నిర్వహిస్తున్న అధికారులను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెబుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుందని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి అందిస్తారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరు లో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లని వారు తొలగించారు. స్టేడియం లో విద్యార్థుల కి మెరుగైన వసతులు ,సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితి ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.




Total views : 78838