ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం..

ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

Advertisements

<p>టాలీవుడ్ ప్రముఖ నిర్మాత RB చౌదరి దుర్మరణం పాలయ్యారు&period; రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు&period; సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తమిళ&comma; తెలుగు&comma; మలయాళం భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు&period; రంగం సినిమా ఫేమ్‌ హీరో జీవా ఆర్‌బీ చౌదరి తనయుడే&period; రాజస్థాన్‌కు చెందిన ఆర్‌బీ చౌదరి పూర్తి పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి&period; వ్యాపార రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయన&&num;8230&semi; మలయాళంలో ఆదిపాపమ్ అనే సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు&period; 1994 లో వచ్చిన కెప్టెన్‌ మూవీ&period;&period; ఆయన తొలి తెలుగు సినిమా&period; పవన్‌ కళ్యాణ్‌ నటించిన సుస్వాగతం తో ఘన విజయాన్ని అందుకున్న ఆయన సూర్యవంశం&comma; రాజా&comma; శీను&comma; నువ్వు వస్తావని&comma; నిన్నే ప్రేమిస్తా&comma; ప్రియమైన నీకు&comma; శివరామరాజు&comma; గోరింటాకు&comma; సంక్రాంతి&period;&period; వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు నిర్మించారు&period; ముఖ్యంగా వెంకటేష్‌&comma; నాగార్జునతో ఆయన అద్భుతమైన సినిమాలు నిర్మించారు&period; కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆర్‌బీ చౌదరి నిలిచారు&period; ఇప్పటివరకు 98 సినిమాలు నిర్మించిన ఆయన&&num;8230&semi; విశాల్‌తో మకుటం సినిమాను నిర్మిస్తున్నారు&period; ఆర్‌బీ చౌదరి మరణవార్తపై టాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సంతాపం తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత RB చౌదరి అకాల మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు&period; ఆయన దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయానని&&num;8230&semi; ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సంతాప సందేశం పంపారు&period; తన మొట్టమొదటి సూపర్‌ హిట్‌ చిత్రం సుస్వాగతానికి ఆయనే నిర్మాత అని గుర్తు చేసుకున్నారు&period; చిత్ర నిర్మాణం&comma; సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతమన్నారు&period; కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని&comma; చక్కటి పాటలు ఉండేలా చిత్రాలు నిర్మించారని&&num;8230&semi; అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందని పవన్ అన్నారు&period; తెలుగు&comma; తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆర్ బి చౌదరి కుటుంబానికి పవన్ కళ్యాణ్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..