గ్రామ పంచాయతీ నిధుల రికవరీ కలకలం

Gram Panchayat

Advertisements

&NewLine;<p>సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల నిధుల రికవరీ కలకలం సృష్టిస్తుంది&period; సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మేళ్లచెరువు గ్రామపంచాయతీలో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని జిల్లా అధికారులు గుర్తించారు&period; రికవరీ చేయాలంటూ గ్రామ సర్పంచ్ పందిల్లపల్లి శంకర్ రెడ్డికి నోటీసులు అందించారు&period; RR యాక్ట్ కింద 45 రోజుల్లో నిధులను రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ మేళ్లచెరువు తాసిల్దార్ కి ఉత్తర్వులు జారీ చేశారు&period; మేళ్లచెరువు గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఇటీవల కొందరు వార్డు సభ్యులు&comma; స్థానికులు ఫిర్యాదు చేయడంతో కోదాడ ఆర్డీవో సత్యనారాయణ రికార్డులు స్వాధీన పరుచుకున్నారు&period; అనంతరం విచారణ చేయగా సాధారణంగా గ్రామపంచాయతీ నిధులు 92లక్షల 66వేల రూపాయలతో పాటు ఆర్థిక సంఘ నిధులు 63లక్షల 30వేల 21 రూపాయలు&comma; రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 43లక్షల 16వేల 86 రూపాయలు మొత్తం కలిపి కోటి 99 లక్షల 12 వేల 112 రూపాయలు దుర్వినియోగం అయినట్లు ఆర్డీవో తేల్చి చెప్పారు&period; ఈ నివేదిక జిల్లా కలెక్టర్ సమర్పించగా ఈవోని సస్పెండ్ చేశారు&period; పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామపంచాయతీ సర్పంచ్ అయిన శంకర్ రెడ్డిని సంజాయిషీ కోరుతూ ఈనెల 16న షోకాజ్ నోటీసులు అందించారు&period; అయితే ఈ నోటీసులకి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో గ్రామపంచాయతీ నిధులను అక్రమంగా దుర్వినియోగంగా డ్రా చేశారని&comma; ఆ డబ్బు మొత్తాన్ని రెవెన్యూ రికవరీల చట్టం ప్రకారం 45 రోజుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ నుండి రికవరీ చేసి గ్రామ పంచాయితీ ఖాతాలో జమ చేయాలని మేళ్లచెరువు తాసిల్దార్ కి కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"cux3aaUqrRQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.