సీఎం హిమంత శర్మ సంచలన వ్యాఖ్యలు

CM Himanta Sharma

Advertisements

&NewLine;<p>అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ వాడిన రాహుల్ గాంధీ డూప్‌ వివరాలను త్వరలో వెల్లడిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు&period; యాత్రలో రాహుల్ గాంధీకి బదులుగా ఆయనలా కనిపించే ఓ వ్యక్తిని కాంగ్రెస్ రంగంలోకి దింపిందని ముఖ్యమంత్రి ఆరోపించారు&period; ఆ డూప్ పేరు&comma; అడ్రస్ వంటి వివరాలను త్వరలో బయటపెడతానని సీఎం తెలిపారు&period; ఇదంతా ఊరికే చెప్పట్లేదని ఆ డూప్ ఎవరు&comma; అతడి అడ్రస్ ఏంటి ఇవన్నీ బయటపెడతానన్నారు&period; సోమవారం గువాహటిలో పర్యటిస్తానని అక్కడి నుంచి తిరిగొచ్చాక రాహుల్ డూప్ పేరు&comma; అడ్రస్ అన్నీ చెబుతానంటూ సీఎం హిమంతశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; మనిపూర్ నుంచీ మహారాష్ట్ర వరకూ రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే&period; ఈ క్రమంలో ఆయన జనవరి 18 నుంచి 25 మధ్య అస్సాంలో పర్యటించిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు&period; దేశంలోనే అత్యంత అవినీతిమయ ముఖ్యమంత్రి హిమంత అని మండిపడ్డారు&period; యాత్రకు అనుమతి ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కూడా కాంగ్రెస్ ఆరోపించింది&period; ఇక గువాహటిలో యాత్ర సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి&period; రాహుల్ గాంధీతో పాటూ మరికొందరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు&period; లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ అరెస్టవుతారని కూడా సీఎం అప్పట్లో వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.