రిజిస్ట్రేషన్లు తగ్గినా…తెలంగాణకు భారీ ఆదాయం..

Advertisements

<p>తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం విభిన్న దృశ్యం కనిపిస్తోంది&period; ఒకవైపు ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతుండగా… మరోవైపు ప్రభుత్వ ఆదాయం మాత్రం గణనీయంగా పెరుగుతోంది&period; 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12&period;5 లక్షల డాక్యుమెంట్లు మాత్రమే నమోదు అయ్యాయి&period; గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 13 లక్షలకుపైగా ఉండగా… ఇప్పుడు దాదాపు 50 వేల మేర తగ్గుదల నమోదైంది&period;<br &sol;>&NewLine;అయితే ఈ తగ్గుదల ప్రభుత్వ ఆదాయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదు&period; స్టాంప్ డ్యూటీ&comma; రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం సుమారు రూ&period;600 కోట్ల మేర పెరిగింది&period; దీని వెనుక ప్రధాన కారణం ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడమే అని తెలుస్తుంది &period; 2026 ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త గైడ్‌లైన్స్ కారణంగా ప్రతి లావాదేవీపై వసూలు అయ్యే రుసుములు పెరిగాయి&period; దీంతో తక్కువ రిజిస్ట్రేషన్లు జరిగినా… ప్రతి డీల్ నుంచి అధిక ఆదాయం రావడం వల్ల ప్రభుత్వ ఖజానా బలపడుతోంది&period;<&sol;p>&NewLine;<p>మరిఓ వైపు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కొనుగోలుదారుల ధోరణిలో వచ్చిన మార్పు కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది&period; గతంలో చాలా మంది ఆస్తుల కొనుగోలు సమయంలో కనీస మార్కెట్ విలువ వద్దే రిజిస్ట్రేషన్లు చేసేవారు&period; కానీ ఇప్పుడు పరిస్థితి మారింది&period; బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందాలంటే… ఆస్తి అసలు విలువను చూపాల్సిన అవసరం పెరిగింది&period; దీంతో చాలా మంది కొనుగోలుదారులు నిజమైన మార్కెట్ ధరలకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు&period; ఈ మార్పు ప్రభుత్వానికి భారీ లాభాన్ని తెచ్చిపెడుతోంది&period; ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలో చూపే విలువ పెరిగిన కొద్దీ స్టాంప్ డ్యూటీ&comma; ఫీజులు కూడా పెరుగుతున్నాయి&period; ఫలితంగా తక్కువ డాక్యుమెంట్లు నమోదైనా… ప్రతి డాక్యుమెంట్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతోంది&period; ఇది రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరుగుతున్న సంకేతంగా కూడా భావిస్తున్నారు&period; దీని వల్ల భవిష్యత్తులో అక్రమ లావాదేవీలు తగ్గే అవకాశముందని నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రధానంగా హైదరాబాద్ నగరం ఈ మార్పుల కేంద్రంగా మారింది&period; ముఖ్యంగా కోకాపేట్&comma; కొండాపూర్&comma; నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఆస్తుల డిమాండ్ గణనీయంగా పెరిగింది&period; కోటి రూపాయలకుపైగా విలువైన ఇళ్ల విక్రయాలు పెరగడం వల్ల మొత్తం రిజిస్ట్రేషన్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది&period; నివేదికల ప్రకారం లావాదేవీల సంఖ్య కొంత తగ్గినా… అధిక విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్ల వల్ల ఆదాయం సుమారు 11 శాతం పెరిగింది&period; 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ&period;10&comma;600 కోట్ల ఆదాయం వచ్చినప్పటికీ… 2025-26లో అదే కాలంలో రూ&period;11&comma;300 కోట్లకు పెరిగింది&period; 6&period;6 శాతం వృద్ధిని సాధించింది &period; ఈ ట్రెండ్ కొనసాగితే ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ&period;19&comma;100 కోట్ల లక్ష్యాన్ని సులభంగా చేరుకునే అవకాశం ఉంది&period; &OpenCurlyQuote;తెలంగాణ రైజింగ్’ వంటి కార్యక్రమాల ద్వారా పెట్టుబడులు పెరగడం కూడా ఈ వృద్ధికి తోడ్పడుతోంది&period; మొత్తానికి రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా… ఆదాయం పెరగడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కొత్త ధోరణిని సూచిస్తోందని చెప్పొచ్చు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..