81
చిత్తూరు జిల్లా(Chittoor District) టమోటో రైతులకు కాసంత ఊరట లభించింది. పలమనేరు వ్యవసాయ మార్కెట్ లో టమోటోల ధరలు పెరిగాయి, దీంతో ఒక బాక్స్ ధర 770 రుపాయల నుండి 810 వరకు పలకడంతో రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల వల్ల వర్షాలు అధికంగా కురవడంతో టమాటోలు నెలకొరిగి తీవ్ర పంట నష్టం జరిగిందన్నారు. కాని ఇప్పుడు ఒకే సారి టమాటో ధరలు పెరగడంతో మాకు ఊరట లభించిందని రైతులు పేర్కొన్నారు. ధరలు సరైన రీతిలో ఉంటే తాము ఏ పంట పండించడానికైనా సిద్ధంగా ఉంటామని రైతులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.