శ్రీవారి అనుగ్రహంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయని, దాదాపు ఏడాదికి సరిపడా తాగు నీళ్లు ఉన్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మైచాంగ్ తుఫాను కారణంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను మంగళవారం ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతూ, 15 రోజుల క్రితం తిరుమల, తిరుపతిలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నదని, దీనిని అధిగమించడానికి కండలేరు రిజర్వాయర్ నుండి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. నవంబరు 23వ తేదీ శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని సప్తగోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించినట్లు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్రహంతో తిరుమల, తిరుపతిలలో ప్రారంభమైన వర్షాలు, గత రెండు రోజుల్లో 24 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి డ్యాంల నుండి నీటిని విడుదల చేస్తారన్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుఝామున గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ డ్యామ్ గేట్లను అధికారులు తెరచి నీటిని బయటకు వదిలినట్లు వివరించారు.
శ్రీవారి ఆశీస్సులతో నిండిన జలాశయాలు.. టీటీడీ ఛైర్మన్
76
previous post