పునరుద్ధరణ మా బాధ్యత కాదు – ఎల్ అండ్ టీ

L&T said restoration is not their responsibility

Advertisements

&NewLine;<p>మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని&comma; దెబ్బతిన్న పియర్స్‌ను పునరుద్ధరించే పని తమది కాదని ఎల్ అండ్ టీ పేర్కొంది&period; పునరుద్ధరణకు అయ్యే ఖర్చును చెల్లించేందుకు అనుబంధ ఒప్పందం కుదుర్చుకుంటేనే ముందుకెళతామని తెలిపింది&period; అయితే&comma; బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా మిగిలే ఉందని&comma; కాబట్టి ప్రాజెక్టు పునరుద్ధరణకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజినీర్లు గతంలో ప్రకటించారు&period; ఇందుకు భిన్నంగా ఎల్ అండ్ టీ లేఖ రాయడంతో తదుపరి చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఇంజినీర్ ఇన్ చీఫ్ కింది స్థాయి ఇంజినీర్లకు ఆ లేఖను పంపడం చర్చనీయాంశమైంది&period; బ్యారేజీ కుంగిన చోట పియర్స్&comma; పునాదికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మించాలి&period; దీనికి రూ&period;55&period;75 కోట్లు ఖర్చవుతందని&comma; ఆ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని కోరుతూ ఎల్ ఎండ్ టీ ఈ నెల 2à°¨ కాళేశ్వరం ఎత్తిపోతల ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది&period; ఈ లేఖను ఈ నెల 5à°¨ సంబంధిత ఎస్ఈకి పంపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈఎన్సీ సూచించారు&period; మరోవైపు&comma; దెబ్బతిన్న బ్లాక్‌ను&comma; పియర్స్‌ను పునరుద్ధరించడానికి సుమారు రూ&period;500 కోట్ల వరకూ ఖర్చు కావొచ్చని నీటిపారుదల శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.