నేడు ‘రైతు నేస్తం’ కార్యక్రమం:
నేడు ‘రైతు నేస్తం(Raitu Nestham)’ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. రైతు నేస్తం పేరిట రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. రైతులకు నూతన సాంకేతికతపై సర్కారు అవగాహనను కల్పించనుంది. ఆవిష్కరణలు, విస్తరణ సేవల కోసం వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇది చదవండి: మంత్రాలపెట్టెను బయటపెట్టిన జనగామ పోలీసులు..
రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్(Conference system) ను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని సెక్రటేరియట్ నుంచి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. రైతుల సమస్యలకు పరిష్కారాలు, సరికొత్త వ్యూహాలపై సర్కారు దృష్టి సారించింది. ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మొదట ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 110 రైతు వేదికల్లో వీసీ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఈ ఉగాది నాటికి అన్ని రైతువేదికల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి