86
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ వల్లే తాను రాజకీయంగా ఎదిగానని, కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభించిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ వాదినని, తనకు మరే పార్టీతో ఇప్పుడు సంబంధం లేదని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తగా నిబద్ధతతో పని చేస్తున్నానని చెప్పారు. అవసరమైతే ఏపీలో కూడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని అన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని మోదీనే బాస్ అని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బీజేపీ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు.