రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్…

రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.

Advertisements

<p>హైదరాబాద్‌లో అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో కలకలం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు&period; ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను&comma; మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న కింగ్‌పిన్ అర్జున్ అలియాస్ ఆజాద్ &comma; అతని సోదరుడు రాజీవ్&comma; తల్లి&comma; మామతో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఖరీదైన కార్లు&comma; లగ్జరీ లైఫ్ స్టైల్‌ను ఎరగా చూపి ఈ ముఠా సాగిస్తున్న అరాచకాలు విచారణలో వెలుగు చూసి విస్తుగొలుపుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>అర్జున్&comma; ఇన్‌స్టాగ్రామ్‌లో తాను కూడా ఒక కోటీశ్వరుడి లా ఫోజులు కొట్టేవాడు&period; ఖరీదైన బెంజ్&comma; ఆడి వంటి లగ్జరీ కార్ల ఫోటోలు&comma; హై-ప్రొఫైల్ పబ్బుల్లో పార్టీల వీడియోలను పోస్ట్ చేస్తూ యువతులను ఆకర్షించేవాడు&period; ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలను&comma; ఒంటరిగా ఉండే సంపన్న యువతులను టార్గెట్ చేసేవాడు&period; ప్రేమ పేరుతో వలవేసి&comma; వారిని నమ్మించి విలాసవంతమైన ప్రదేశాలకు తీసుకెళ్లి&comma; అతి సాన్నిహిత్యంగా ఉంటూ ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు&period;<&sol;p>&NewLine;<p>ఈ ముఠా కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా&comma; బాధితుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు&comma; వాచ్‌మెన్‌లతో కూడా స్నేహం చేసేది&period; వారి ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు&comma; పిల్లల కదలికలను సేకరించేది&period; ఒక పారిశ్రామికవేత్త కుమార్తెను ట్రాప్ చేసిన అర్జున్&comma; ఆమె డ్రైవర్ ఫోన్ ద్వారానే సంభాషణలు సాగించి&comma; ఆ తర్వాత రికార్డ్ చేసిన వీడియోలతో బెదిరించడం మొదలుపెట్టాడు&period; ఈ వ్యవహారంలో అర్జున్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ&comma; బాధితులను భయభ్రాంతులకు గురిచేసి లక్షల రూపాయలు వసూలు చేసేవారు&period;<&sol;p>&NewLine;<p>ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెను బెదిరించి సుమారు 30 లక్షల రూపాయలు వసూలు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది&period; బాధితురాలు ధైర్యంగా జూబ్లీహిల్స్ పోలీసులను&comma; షీ-టీమ్స్‌ను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు&period;&period; టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్నాయి&period; ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగా యువతులు ఈ ముఠా బారిన పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు&period; నిందితుల ఫోన్లలో అనేక అభ్యంతరకర వీడియోలు&comma; ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..