పుదుచ్చేరి ఎన్నికల్లో రోబో సందడి..

Advertisements

<p>పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త వింత చోటుచేసుకుంది&period; ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు ఓ అందమైన భామ చేతులు జోడించి స్వాగతం పలుకుతోంది&period; అయితే ఆమె మనిషి కాదు&period;&period; ఒక హ్యూమనాయిడ్ రోబో&period;&period; సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న ఈ నీల రోబో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది&period; ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లను భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రయోగాన్ని చేపట్టింది&period; హ్యూమనాయిడ్ రోబో పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; ఓటు వేయడానికి వస్తున్న వారికి చేతులు జోడించి నమస్కరిస్తూ&period;&period; వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది&period;<&sol;p>&NewLine;<p>కేవలం నమస్కరించడమే కాదు&period;&period; ఓటు వేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు&period;&period; మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోండి అంటూ స్ఫూర్తిదాయక సందేశాలు ఇస్తోంది నీల&period; ఈ వినూత్న స్వాగతాన్ని చూసి ఓటర్లు ఫిదా అయిపోతున్నారు&period; ముఖ్యంగా యువ ఓటర్లు ఈ రోబోతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు&period; దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పండుగ వాతావరణం నెలకొంది&period; సాధారణంగా పోలింగ్ కేంద్రం అంటే సీరియస్ వాతావరణం ఉంటుంది&period; కానీ&comma; ఈసారి ఓటర్లలో ఉత్సాహం నింపేందుకు&comma; ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది&period; ఉదయం నుంచే భారీగా తరలివస్తున్న ఓటర్లు&period;&period; నీల రోబో ఇస్తున్న సందేశాలతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు&period; టెక్నాలజీని ప్రజాస్వామ్యంతో ముడిపెట్టిన ఈ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.