రోజా, బైరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న విజిలెన్స్..

Advertisements

<p>వైసీపీ ప్రభుత్వ హయాంలో &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఆడుదాం&period;&period; ఆంధ్రా’’ పేరిట సాగిన అవినీతి ఆటపై విజిలెన్స్‌ నివేదిక ప్రభుత్వానికి చేరింది&period; ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు ముప్పయి పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేశారు&period; అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి రోజా&comma; శాప్‌ మాజీ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు&period; వీరిద్దరిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు&period; వీరితో పాటు అప్పటి శాప్‌ ఇన్‌చార్జి ఎండీ హర్షవర్ధన్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు&period; అలాగే అప్పటి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌&comma; మరో ఐఏఎస్‌ అధికారి ధ్యాన్‌చంద్‌తో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి వాణీమోహన్‌పైనా తగు చర్యలు తీసుకోవాలని కోరారు&period; శాప్‌లోని ఐటీ విభాగంలో పనిచేసే వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని&comma; వారిపైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు&period;ఎన్నికలకు ముందు ఓట్ల కోసమే వైసీపీ నేతలు ఆడుదాం&period;&period; ఆంధ్రా పేరిట యువతను మభ్యపెట్టేందుకు ప్రయత్నించి అవకతవకలు కు‌ పాల్పడ్డారని నివేదికలో స్పష్టం చేశారు&period; నిధులు పక్కదారి పట్టించి జేబులు నింపుకున్నారు&period; శాప్‌ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తూ క్రీడాకారులకు అన్యాయం చేసింది&period; ఆడుదాం&period;&period; ఆంధ్రా పేరిట మొత్తం రూ&period;40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ చేశారువిజిలెన్స్‌ అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.