రేవంత్‌రెడ్డి వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌

RSS

Advertisements

&NewLine;<p>ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌ డైరెక్షన్‌లోనే కాంగ్రెస్‌ నడుస్తున్నదని&comma; గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ వ్యవహరాలన్నీ నడిపించేది ఆర్‌ఎస్‌ఎస్సేనని ఎంఐఎం పార్టీ అధినేత&comma; ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విమర్శించారు&period; వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో ఎంఐఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు&period; ఈ సందర్భంగా అసదుద్దీన్‌ మా ట్లాడుతూ రేవంత్‌రెడ్డి బతికి ఉన్నంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌తోనే ఉంటారని&comma; ఆయనను కాంగ్రెస్‌లోకి పంపింది ఆ సంస్థేనని అన్నా రు&period; ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌ అయిన రేవంత్‌ను కొడంగల్‌లో చిత్తుగా ఓడించాలని ఎంఐ ఎం శ్రేణులకు పిలుపునిచ్చారు&period; కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని&comma; పోటీ పరీక్షలకు బుర్ఖా ధరించి హాజరుకావద్దని కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని విమర్శించారు&period; ఈ తొమ్మిదన్నరేండ్లలో తెలంగాణలో బుర్ఖా ధరించి పరీక్షలకు వెళ్తే ఎవరైనా అడ్డుకున్నారా అనేది ఆలోచించాలని కోరారు&period; తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని&comma; రాష్ట్రం సస్యశ్యామలంగా&comma; ప్రశాంతంగా ఉండాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతిచ్చి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు&period; తొమ్మదిన్నరేండ్ల అభివృద్ధిని చూసి డిసెంబర్‌ 30à°¨ ఆలోచించి ఓటేయాలని సూచించారు&period; తొమ్మిదిన్నరేండ్లలో షాదీ ముబారక్‌ కింద 2 వేల 340 కోట్ల రూపాయల నిధులిచ్చారని&comma; 205 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారని తెలిపారు&period; 14 లక్షల మంది విద్యార్థులకు 474 కోట్ల రూపాయల పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు&period; సీఎం ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద 3 వేల 224 మంది ముస్ల్లింలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసిందని వెల్లడించారు&period; గోషామహాల్‌లో బీజేపీకి మద్దతిస్తున్నది కాంగ్రెస్సేనని ఆరోపించారు&period; వయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్