బస్ స్టేషన్ సౌకర్యం లేక ప్రయాణికులకు ఇబ్బందులు..

Advertisements

<p>పల్నాడు జిల్లా దాచేపల్లి… ఒకప్పుడు రద్దీగా కిటకిటలాడిన బస్ స్టేషన్ … ఇప్పుడు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది&period; దాదాపు 16 గ్రామ పంచాయతీలకు కేంద్రంగా ఉన్న దాచేపల్లి లో నిత్యం వందలాది మంది ప్రజలు పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు&period; గుంటూరు&comma; హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు కనెక్టివిటీ ఉండడంతో ఈ బస్ స్టేషన్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది &period; కానీ ప్రస్తుతం బస్సులు బస్ స్టేషన్ లోకి రాకపోవడం&comma; సరైన వసతులు లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపైనే ఎండలో నిలబడి ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది&period; అసలే ఎండా కాలం &period;&period;ప్రయాణికులకు నిలువ నీడ లేకపోవడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది &period; బస్ స్టేషన్ ఎదుట ఉన్న బ్రిడ్జి కారణంగా బస్సులు లోపలికి రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ&comma; ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; ఒకప్పుడు ప్రయాణికులతో సందడితో కళకళలాడిన ఈ ప్రదేశం… ఇప్పుడు ముళ్ళ చెట్లతో నిండిపోయి పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది&period;మరో వైపు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది &period;<&sol;p>&NewLine;<p>దాచేపల్లి బస్టాండ్‌లో ఉన్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి&period; బస్ స్టేషన్ ప్రాంగణం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ముళ్ళ చెట్లతో నిండిపోవడం&comma; చెత్తాచెదారంతో మురికి కూపంగా మారడం ఆందోళన కలిగిస్తోంది&period; ముఖ్యంగా టాయిలెట్ సదుపాయం లేకపోవడం మహిళలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది&period; ఉన్న టాయిలెట్లకు తలుపులు కూడా లేకపోవడంతో అవి వాడుకకు పనికిరాని స్థితిలో ఉన్నాయి&period; దీంతో మహిళలు అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు&period; ప్రస్తుతం ఈ ప్రదేశం పిల్లలు ఆడుకునే స్థలంగా మారిపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతుంది &period; 16 గ్రామాల ప్రజలు నిత్యం ఈ మండల కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో కనీస సౌకర్యం కూడా లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు&period; కోట్ల రూపాయాలతో నిర్మించిన బస్ స్టేషన్ ఎలా నిరుపయోగంగా మారడంపై ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి &period; ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్ స్టేషన్ ను పునరుద్ధరించి&comma; ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.