ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి..

Advertisements

<p>తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టారు ఆర్టీసీ కార్మికులు&period; ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు&period; ఆర్టీసీ పరిరక్షణ&comma; ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు&period; సమస్యలకు సమ్మె మాత్రమే పరిష్కారం కాదని&comma; చర్చల ద్వారానే ముందుకు వెళ్దామని సూచించారు&period; కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని వేసిందన్న మంత్రి పొన్నం&period;&period;కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న విమర్శల్లో నిజం లేదన్నారు&period; నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు&period; కార్మికులు లేవనెత్తిన 32 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు&period; కేవలం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం&comma; గుర్తింపు సంఘాల ఎన్నికలు అనే రెండు ప్రధాన అంశాలు మాత్రమే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని&comma; వాటిపై కూడా సీఎం&comma; డిప్యూటీ సీఎంతో చర్చిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>ఆర్టీసీ జేఏసీ నేతలు తమ నిరసనను కొనసాగించవచ్చని&comma; కానీ సాధారణ కార్మికులు మాత్రం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విధుల్లో చేరాలని కోరారు మంత్రి పొన్నం&period; ముఖ్యంగా నిరుపేద ప్రయాణికులకు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని&comma; వారిని ఇబ్బంది పెట్టవద్దని విన్నవించారు&period; ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండానే డిమాండ్లను పరిష్కరించుకుందామన్నారు&period; ప్రభుత్వం మీ సమస్యల పట్ల అత్యంత సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.