ఏయూ వందేళ్ల వేడుకకు సచిన్ టెండూల్కర్ హాజరు..

Advertisements

<p>విశాఖ సాగరతీరాన విద్యాకుసుమంలా విరిసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి&period; ఇంజినీరింగ్‌ కాలేజ్ గ్రౌండ్స్‌ లో ఏర్పాటు చేసిన ఈ చారిత్రాత్మక వేడుకలకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విశిష్ట అతిథిగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; భారత క్రికెట్ దిగ్గజం&comma; మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన జీవితంలోని కొన్ని మధుర జ్ఞాపకాలను&comma; విజయ రహస్యాలను పంచుకున్నారు&period; తన తండ్రి గురించి చెప్తూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు&period; ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైందని చెబుతూ ప్రసంగం ప్రారంభించారు&period; తాను చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చానని&comma; మొదట్లో రెండు గదుల ఇంట్లోనే సర్దుకున్నామని సచిన్ గుర్తుచేసుకున్నారు&period; తన తండ్రికి చదువంటే ఎంతో ఇష్టమని&comma; ఆయన ఏకాగ్రత అమోఘమని తెలిపారు&period; తాను క్రీడాకారునిగా నిలదొక్కుకున్నాకే కారు కొన్నానని తెలిపారు&period; ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి ఉంటుందని &comma; అది బాహ్య&comma; అంతర్గత ఒత్తిడి అని రెండు రకాలుగా ఉంటుందని పేర్కొన్నారు&period; నెట్స్‌లో నిరంతరం సాధన చేయడం వల్లే తాను ఉన్నత స్థాయికి ఎదిగానని స్పష్టం చేశారు&period; లక్ష్యం వైపు వెళ్లేటప్పుడు ఎన్నో అనుమానాలు వస్తాయని&comma; బౌలర్ ఎలాంటి బంతి వేస్తాడో ఊహించలేమని&comma; అలాంటి ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగడమే కీలకమని యువతకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..