హిందూ మనోభావాలు దెబ్బతీసేలా జగన్ పరిపాలన…

Sagara Sangam is not developed by YCP government

Advertisements

&NewLine;<p>సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు&period; కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమ క్షేత్రాన్ని మండలి బుద్ధ ప్రసాద్&comma; టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్&comma; టీడీపీ నాయకులు పరిశీలించారు&period; దెబ్బతిన్న భవనాలు&comma; విగ్రహాలు&comma; రోడ్డు పరిశీలించారు&period; ఈ సందర్బంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి అంటేనే సంగమ స్నానం అని ఈ ప్రభుత్వానికి తెలియదా&quest; అని ప్రశ్నించారు&period; ఈ నెల 24న మాఘ పౌర్ణమి స్నానాలు ఖచ్చితంగా సాగర సంగమంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు&period; వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా భక్తులకు సాగర సంగమానికి అనుమతి ఇవ్వలేదన్నారు&period; సాగర సంగమ ప్రాశస్థ్యం తెలిసి ఆది శంకరాచార్యులు ఇక్కడ స్నానం చేశారని&comma; గంగానది కాకి రూపంలో వచ్చి స్నానం చేసి హంస రూపం పొందిందన్నారు&period; శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా భక్తులు మాఘ పౌర్ణమికి సాగర సంగమానికి వస్తారని&comma; గత కాంగ్రెస్&comma; టీడీపీ ప్రభుత్వాలు మాఘ పౌర్ణమి స్నానాలు సంగమ క్షేత్రంలోనే నిర్వహించాయని గుర్తు చేశారు&period; గత కృష్ణా పుష్కరాలకు వేలాది మంది ప్రతి రోజు సంగమ క్షేత్రంలో స్నానాలు చేశారని&comma; ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా బాధ్యతగా నిర్వహించామన్నారు&period; సంగమ క్షేత్రంలో చంద్రబాబు పుష్కర స్నానం చేసి అభివృద్ధికి సహకరించారన్నారు&period; ఈ క్షేత్రంలో భక్తుల కోసం రెండు భవనాలు నిర్మించి దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు&period; అటవీ శాఖ అధికారులు ఈ భవనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు&period; ఈ ప్రభుత్వం దేవుళ్ళ విగ్రహాల నిర్వహణ పట్టించుకోలేదని బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు&period; ఈ వైసీపీ ప్రభుత్వానికి హిందూ మనోభావాలపై విశ్వాసం ఉంటే ఖచ్చితంగా సంగమ క్షేత్రంలో నిర్వహించాలన్నారు&period; జగన్మోహనరెడ్డికి హిందూ మనోభావాలపై విశ్వాసం ఉంటే తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు&period; లేకపోతే భక్తుల శాపాలతో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…