సహారా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

ubrata Roy

Advertisements

&NewLine;<p>సహారా గ్రూపు వ్యవస్థాపకుడు&comma; ఛైర్మన్ సుబ్రతా రాయ్ కన్నుమూశారు&period; ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు&period; ప్రాణాంతక మెటాస్టాటిక్&comma; బీపీ&comma; మధుమేహం వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన ఈ ఆదివారం కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్‌‌కు గురయ్యారని&comma; చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ప్రకటనలో కంపెనీ పేర్కొంది&period; ఆయన మృతితో కంపెనీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొంది&period; సుబ్రతా రాయ్‌కి భార్య స్వప్నా రాయ్&comma; ఇద్దరు కొడుకులు ఉన్నారు&period; ఇద్దరు కుమారులు సుశాంతో రాయ్&comma; సీమాంటో రాయ్ విదేశాల్లో ఉంటున్నారు&period; సుబ్రతా రాయ్ 1948లో బీహార్‌లోని అరారియాలో పుట్టారు&period; 1978లో &OpenCurlyQuote;సహారా ఇండియా పరివార్’ ప్రారంభించడంతో ఆయన సక్సెస్ స్టోరీ మొదలైంది&period; కేవలం రూ&period;2&comma;000 మూలధనంతో ప్రారంభినప్పటికీ వ్యవస్థాపకత విషయంలో కంపెనీని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సుబ్రతా రాయ్ కృషి చేశారు&period; లక్నోను కేంద్రంగా చేసుకొని కంపెనీ కార్యకలాపాలను నిర్వహించారు&period; అయితే &OpenCurlyQuote;సహారా చిట్ ఫండ్ స్కామ్’ కేసులో కంపెనీ అనేక సమస్యలను ఎదుర్కొంది&period; సుబ్రతా రాయ్ మృతిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.

ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.