అరవింద్ కేజ్రీవాల్ కు నిరసనగా రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్:
లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ ప్రకటించింది. ‘సేవ్ డెమోక్రసీ(Save Democracy)’ నినాదంతో భారీ ర్యాలీ చేపడతామని ప్రతిపక్షాల నేతలు తెలిపారు. ఆదివారం ఆప్ నేతలతో కలిసి కాంగ్రెస్(Congress), సీపీఎం నేతలు సంయుక్త నిరసనలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తీరుపై ప్రజల్లో చాలా ఆగ్రహం ఉందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్(Gopal Roy) అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు దర్యాప్తు సంస్థలను ప్రధాని మోదీ ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాగా, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ కూడా బీజేపీపై మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎన్నికైన ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని, పురాతన రాజకీయ పార్టీ ఖాతాలను స్వాధీనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మా నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) యుద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గదు అని అన్నారు. మరోవైపు మార్చి 31న ‘ఇండియా’ బ్లాక్‌కు చెందిన మిత్రపక్షాల నేతలు ఏకతాటిపైకి వస్తారని సీపీఎం నేత రాజీవ్ కున్వార్(Rajeev Kunwar) తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడులను తాము సహించబోమని అన్నారు.
ఇది చదవండి: కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి